AP: ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీపికబురు చెప్పారు. సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తృతం చేసే దిశగా.. పీఎం సూర్యఘర్ కనెక్షన్లు మంజూరు చేయాలని మంత్రి గొట్టిపాటి అన్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వేసవి ముగిసే నాటికి ప్రతి నియోజకవర్గంలో 6 వేల సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. సీపీడీసీఎల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న 11 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు.