AP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు వేటకొడవళ్లతో మొదలైన ఆ పార్టీ రాజకీయం, కాలక్రమేణా కత్తిగా మారి, నేడు గొడ్డలి సంస్కృతి వరకు రూపాంతరం చెందిందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంగారు భవిష్యత్తును కాపాడుకోవడానికి, రాబోయే రోజుల్లో ఈ "గొడ్డలి పార్టీ"ని ప్రజలందరూ కలిసికట్టుగా శాశ్వతంగా సమాధి చేయాలని నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.