AP: ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'మీ మార్ట్' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా లాలుపురంలో తొలి 'మీ మార్ట్'ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రస్తుతం 50 రకాల వస్తువులు అందుబాటులో ఉండగా, త్వరలో వాటిని 250కు పెంచనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 1,000 'మీ మార్ట్'లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దుకాణాల్లో మార్కెట్ ధరల కంటే ప్రతి వస్తువుపై రూ.5 వరకు తక్కువ ధరకు విక్రయించనున్నట్లు మంత్రి వెల్లడించారు.