ఇకపై రాజధాని అమరావతి అజేయం: పవన్‌ కల్యాణ్‌

AP: అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం శుభపరిణామమని, ప్రజలంతా సంబరాలు చేసుకునే సమయం వచ్చిందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇకపై అమరావతి అజేయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్