అన్నదాతలకు ఇంధన కష్టం: వైసీపీ

AP: డీజిల్ కొరత వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందని వైసీపీ పేర్కొంది. మంగళవారం ఎక్స్ వేదికగా.. ‘హార్వెస్టర్లు, నీళ్లు తోడే మోటర్లు నడిచే పరిస్థితి లేకుండా పోయింది. ఆక్వా రంగాన్ని డీజిల్ కొరత మరింత కుదేలు చేస్తుంది. రైతులకు డీజిల్ కూపన్లు ఇస్తామన్న ప్రభుత్వం.. ఈ విషయంలోనూ రాజకీయాలు చేస్తుంది. పైరవీలు ఉంటే తప్ప కూపన్లు దక్కించుకునే పరిస్థితి లేకుండా పోయింది’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్