బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల

AP: రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు శుభవార్త అందించింది. గత రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపునకు రూ.1,315 కోట్లు విడుదల చేసేందుకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధులను 2024-25, 2025-26 విద్యా సంవత్సరాలకు వినియోగించనున్నారు. బీసీ సంక్షేమశాఖకు తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకటి, రెండు రోజుల్లో ఈ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్