గాజువాక రోడ్డు ప్రమాదం బాధాకరం: వైయస్‌ జగన్‌

విశాఖ జిల్లా గాజువాకలో ఆగివున్న లారీని బస్సు ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక డ్రైవర్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జగన్, ప్రమాదంలో గాయపడిన ఏడుగురు బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్