కర్నూలు పట్టణంలోని బాలాజీ నగర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలడంతో కూలర్ల గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీ సంఖ్యలో కూలర్లు తగలబడిపోయాయి. ప్లాస్టిక్ సామాగ్రి కావడంతో వేగంగా మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పని చేసే సిబ్బంది వంట కోసం తెచ్చిన రెండు గ్యాస్ సిలిండర్లు పేలడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.