AP: అమలాపురంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం గొయ్యి తవ్వుతుండగా గ్యాస్ పైప్‌లైన్ దెబ్బతిని గ్యాస్ లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న గెయిల్ అధికారులు వెంటనే అప్రమత్తమై పైప్‌లైన్ వాల్వ్‌లను మూసివేశారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.