AP: గుంటూరు GGHలోని నాట్కో క్యాన్సర్ సెంటర్లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక జన్యు పరీక్షా ల్యాబ్‌ను ఎల్లుండి మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఏపీలో ఇదే తొలిసారి. భవిష్యత్తులో అమరావతి క్వాంటం వ్యాలీలో పూర్తి స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఈ ల్యాబ్ ద్వారా క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలో కీలక పురోగతి సాధించనుంది.