ఏపీలో సర్పంచ్ ఎన్నికలకు సిద్ధం!

AP: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే పూర్తిచేసి, బీసీల రిజర్వేషన్‌లపై కమిషన్ నివేదిక అందజేయగానే ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని యోచిస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ కూడా జరుగుతోంది. జులై నెలలో రిజర్వేషన్లు ఖరారు చేసి, సెప్టెంబరులో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసేలా ప్రణాళిక జరుగుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్