టీటీడీ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. న్యాయవాది సుధారెడ్డి టీటీడీ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి పలువురి వద్ద రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేసింది. 2023లో జనవరిలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి.. ఆరునెలల గడువు ఇచ్చింది. అయితే 2024లో జగన్ ఓడిపోవడంతో ఉద్యోగాలు రావని చెప్పింది. డబ్బులు తిరిగి ఇవ్వడానికి వాయిదాలు వేస్తూ వచ్చింది. దీంతో బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్