AP: రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేశ్ అన్నారు. బుధవారం తిరుపతి జిల్లా శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రూ.1,000 కోట్లతో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ఏర్పాటు కానుందని చెప్పారు. 2028 నాటికి ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తుందన్నారు.