ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసులు ఎదురుచూస్తున్న కల నెరవేరింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించే కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రెగ్యులేటర్‌ను ఆన్ చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేశారు. అనంతరం, ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ కాలువ వద్దకు చేరుకుని జలహారతి ఇచ్చారు.