గోదావరి ఉద్ధృతి.. పాపికొండల యాత్ర నిలిపివేత‌

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి న‌ది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పాపికొండల విహార యాత్రను అధికారులు నిలిపివేశారు. ఇదిలా ఉంటే.. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం ఆవరణలోకి గోదావ‌రి వరద నీరు చేరింది. భక్తుల క్యూలైన్లతో పాటు ఆలయం సమీపంలోని దుకాణాలను వరద ముంచెత్తింది. దీంతో దర్శనాలను ఆపేశారు.

సంబంధిత పోస్ట్