AP: గుంటూరు జిల్లాలో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తిని మోసం చేసి ఇద్దరు వ్యక్తులు రూ.20 వేలు కాజేసిన ఘటన వెలుగు చూసింది. ఈ నెల 18న గుంటూరులోని ఓ స్కిన్ స్పెషలిస్ట్ వద్దకు చికిత్సకు వచ్చిన ప్రకాశం జిల్లాకు చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తిని లక్ష రూపాయల విలువైన బంగారు చైన్ ఇస్తానని నమ్మించి, రూ.20 వేలు తీసుకుని ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. చైన్ నకిలీదని తెలియడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీటీవీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.