రాయలసీమలో బంగారు గనులు

AP: రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలో బంగారు గనుల అన్వేషణను ముమ్మరం చేసింది. కర్నూలు జిల్లా జొన్నగిరి, చిత్తూరు జిల్లా కుప్పంతో పాటు, తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలోని జౌకల, రామగిరి ప్రాంతాల్లోనూ బంగారం నిక్షేపాలున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా, శ్రీసత్యసాయి జిల్లాలోని ఎన్పీకుంట మండలం జౌకల ప్రాంతంలో ఖనిజాన్వేషణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇక్కడ మొత్తం ఆరు బ్లాకుల్లో నాలుగు దశల్లో పరిశోధనలు జరగనున్నాయి. ఈ పరిశోధనల కోసం ఆరు ప్రైవేట్ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత పోస్ట్