AP: కూటమి ప్రభుత్వం పత్తి రైతులకు శుభవార్త అందించింది. రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించి, పత్తికి కనీస మద్దతు ధర (MSP) రూ.8,110గా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీసీఐ సంబంధిత అధికారులను పత్తి సేకరణ చేపట్టాలని ఆదేశించారు. రైతులు రైతు సేవా కేంద్రాల ద్వారా 'కపాస్ కిసాన్' యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.