డ్వాక్రా మహిళలకు శుభవార్త.. 2 రోజుల్లో ఖాతాల్లోకి రూ.8 లక్షలు!

AP: కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. స్త్రీనిధి పథకం కింద 2 నూతన పథకాలను ప్రవేశపెట్టి, స్వయం సహాయక సంఘాలలోని ప్రతి మహిళకు రూ.1 లక్ష నుంచి రూ.8 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. NTR విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి పథకాల ద్వారా వారి పిల్లల ఉన్నత విద్య, వివాహాలకు చేయూతనివ్వనుంది. ఈ పథకాల కింద వచ్చే 48 గంటల్లోనే మహిళల ఖాతాల్లోకి నిధులు జమ చేయనుంది. సంఘాల పనితీరును బట్టి A-D గ్రేడ్‌లుగా వర్గీకరించి రూ.70 లక్షల నుంచి కోటి వరకు రుణ సౌకర్యం కల్పించనుంది.

సంబంధిత పోస్ట్