AP: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళల ఆర్థిక సాధికారత దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ఆదేశాలతో స్వయం సహాయ సంఘాలకు మంజూరు చేసే రుణాలపై విధించే ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇన్‌స్పెక్షన్ ఛార్జీలను పూర్తిగా మినహాయిస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, ఇప్పటివరకు రూ.10 లక్షలకు పైబడిన క్యాష్ క్రెడిట్ రుణాలపై ప్రతి లక్షకు రూ.350 చొప్పున ప్రాసెసింగ్ ఛార్జీలు, రూ.5 లక్షలకు పైబడిన టర్మ్ లోక్ రుణాలపై 1.30 శాతం ప్రాసెసింగ్ ఛార్జీ విధించేవారు.