డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. రూ.30 వేల వరకు!

AP: డ్వాక్రా మహిళలకు మెప్మా (MEPMA) ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటీలు, ఆటోలు కొనుగోలు చేయడానికి ఆర్థిక తోడ్పాటు అందిస్తుంది. మహిళలు స్వయం ఉపాధి కింద ఈ వాహనాలను డ్వాక్రా గ్రూప్ ద్వారా తీసుకుంటే సబ్సిడీ కూడా పొందవచ్చు. స్కూటీ లేదా బైక్‌ తీసుకునే వారికి రూ. 12 వేలు, ఆటో అయితే రూ. 30 వేల వరకు సబ్సిడీ ఇస్తారు. మరిన్ని వివరాల కోసం ఆయా జిల్లాల్లోని మెప్మా అధికారులను సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్