ఇంటర్ పాసైన విద్యార్థినులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5 వేల స్కాలర్‌షిప్

AP: ఇంటర్ పాసైన విద్యార్థినులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఏటా స్కాలర్‌షిప్ అందిస్తోంది. అందుకోసం గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (GEST) నిర్వహిస్తోంది. ఈ ఏడాది జూన్ 14న ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో టాప్ 25 ర్యాంకులు సాధించిన బాలికలకు ఉపకారవేతనం అందించనున్నారు. మొదటి 10 ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందిన వారికి రూ.3 వేలు అందిస్తారు. డిగ్రీ పూర్తి చేసే వరకు ఈ స్కాలర్‌షిప్ అందుతుంది. 
వెబ్‌సైట్: www.ntrcollegeforwomen.education

సంబంధిత పోస్ట్