చేనేత కార్మికులకు శుభవార్త.. ఆగస్టు 7న అకౌంట్లలో రూ.25,000 జమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త తెలిపింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని అమలు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 55 వేల మంది అర్హులైన చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున జమ చేయనుంది. అలాగే రాట్నం వడకడం, రంగులు అద్దడం వంటి చేనేత అనుబంధ రంగాల్లో పనిచేసే కార్మికులను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

సంబంధిత పోస్ట్