AP: విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు పొడిగించింది. జూన్ 1 నుంచి కాలేజీలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. దానిని జూన్ 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దాంతో 5వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 వరకు ఉండటంతో ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.