ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)పై విధించే గ్రీన్ టాక్స్(రూ.3,000 దాకా)ను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను క్యాబినెట్ ఆమోదించింది. అందువల్ల ఇకపై ఎలక్ట్రిక్ వాహనం కొనేవారికి.. గ్రీన్ ట్యాక్స్ తక్కువగా పడనుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతుంది.