ఏపీలో ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్లు

AP: ముస్లిం మహిళల ఉపాధి అవకాశాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేయనుంది. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాల్లో ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. శిక్షణ పూర్తిచేసిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను కూడా పంపిణీ చేయనుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా కసుమూరులో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ఈ పథకం విజయవంతం కావడంతో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో అమలయ్యే ఈ పథకానికి రూ.1.70 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.

సంబంధిత పోస్ట్