AP: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కింద అర్హులైన వారికి ప్రతి నెలా పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 2026 పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. జనవరి నెల పింఛన్‌ను 1వ తేదీ కాకుండా.. ఒక రోజు ముందుగానే అందించనున్నారు. డిసెంబర్ 31వ తేదీన ఉదయం 7 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించనున్నారు.