విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.కోటి గెలుచుకోండిలా

నీతి ఆయోగ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహకారంతో ‘వికసిత్ భారత్ బిల్డ్‌థాన్-2025’ పేరుతో అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో దేశంలోని అన్ని పాఠశాలలు భాగస్వామ్యం కావొచ్చు. స్వదేశీ, ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, సమృద్ధి థీమ్‌లలో ఒకదాన్ని ఎంచుకుని సమస్యకు పరిష్కారాన్ని చూపుతూ 2-5 నిమిషాల నిడివితో వీడియో రూపొందించాలి. అక్టోబర్ 31 తేదీ వరకు vbb.mic.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టరై అప్లోడ్ చేయాలి. విజేతలకు రూ.కోటి విలువైన బహుమతులు అందజేస్తారు.

సంబంధిత పోస్ట్