AP: తొలి వందే భారత్ స్లీపర్ రైలు విశాఖపట్నం-బెంగళూరు మధ్య త్వరలో అందుబాటులోకి రానుంది. వారంలో ఆరు రోజులు నడిచే ఈ రైలు, విశాఖపట్నం నుండి రాత్రి 8.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే సమయానికి బెంగళూరు నుండి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, కృష్ణాకెనాల్, నంద్యాల, ధర్మవరం మీదుగా వెళ్లనుంది.