ఆ విద్యార్థులకు రూ.లక్ష ప్రోత్సాహక నగదు ప్రకటన

AP: రాష్ట్రంలోని విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇటీవల జరిగిన పోటీ పరీక్షల్లో అర్హత సాధించడంతో పాటు.. ఐఐటీ, నీట్‌లో అర్హత సాధించి మెడిసిన్‌, ఇంజనీరింగ్‌లో సీట్లు పొందిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.లక్ష నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే ఎస్సీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు 11 రకాల వస్తువులతో కాస్మెటిక్‌ కిట్స్‌ అందజేయనున్నట్లు టీడీపీ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.

సంబంధిత పోస్ట్