AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఈ మేరకు మహిళల కోసం రూ.250 కోట్లతో చేపట్టిన కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని రేపు సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో లక్ష మందికి పైగా మహిళలకు ఉపాధి లభించనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని కరువు పీడిత ప్రాంతాలైన కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా అమలు చేయనున్నారు.