AP: కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ 2029 నాటికి పక్కా ఇళ్లు అందించాలనే లక్ష్యంతో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల దరఖాస్తులు రాగా, 7.5 లక్షల మంది అర్హులని ప్రభుత్వం అంచనా వేసింది. వీరికి ఇళ్లు నిర్మించనుండగా, మిగిలిన వారికి స్థలాలు కేటాయించనున్నారు. అలాగే ఈ ఏడాది జూన్ నాటికి 2.61 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.