ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఇకపై వారి అకౌంట్లలోకి రూ.2 లక్షల 39 వేలు

సొంత స్థలం ఉన్న నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పీఎంఏవై గ్రామీణ్ 2.0 కింద ఇళ్ల నిర్మాణానికి అందించే ఆర్థిక సాయాన్ని పెంచింది. గతంలో రూ.1.80 లక్షలు అందించగా, ఇప్పుడు వివిధ పథకాలు, బ్యాంకు రుణాలతో కలిపి ఒక్కో లబ్ధిదారుకు రూ.2.39 లక్షల వరకు ప్రయోజనం అందనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.95,400, రాష్ట్ర ప్రభుత్వం రూ.63,600 సబ్సిడీగా అందించనున్నాయి. అదనంగా ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల వేతనం, స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు, మహిళా సంఘాల సభ్యులకు రూ.80 వేల వరకు తక్కువ వడ్డీ రుణం లభించనుంది. 2026-29 మధ్య నిర్మించే ఇళ్లకు ఈ సాయం వర్తించనుంది.

సంబంధిత పోస్ట్