AP: రాష్ట్రంలోని పేదలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాదిలోనే మరోసారి సామూహిక గృహప్రవేశాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరినట్లు సర్వేలో తేలిందని, ఇళ్ల నిర్మాణంతో పాటు స్థలాల పంపిణీ ప్రక్రియ త్వరగా చేపట్టాలని గృహ నిర్మాణ శాఖ అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో టిడ్కో ఇళ్లకు అదనంగా మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు.