AP: రైతులకు గుడ్ న్యూస్. ధాన్యం బకాయిల డబ్బులను ఏపీ ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తోంది. ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 30 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 660 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 2024-25 ఖరీఫ్, రబీ సీజన్లో ఏపీ పౌర సరఫరాల సంస్థ 2,01,934 రైతుల వద్ద నుంచి 4575.32 కోట్ల విలువైన 19,84,098 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల వివరించారు.