AP: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అల్లవరం మండలం ఓడలరేవు సమీపంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అనుమతులు లభించాయని అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాథుర్ తెలిపారు. దీనికోసం 7 ఎకరాల స్థలాన్ని సేకరించామని అన్నారు. అలాగే రూ.3.5 కోట్ల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. ఇందుకు సహకరించిన మంత్రి లోకేష్‌కు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.