AP: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందజేసింది. విద్యార్థులకు మరింత రుచికరంగా భోజనాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు నేటి నుంచి 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా.. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందించనుంది. దీనికోసం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పిల్లలకు పోషకాహారం అందించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది.