‘అక్షర ఆంధ్ర’తో సత్ఫలితాలు: మంత్రి నారా లోకేశ్‌

AP: ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని లోకేశ్ ఆదేశించారు. 2024లో 72.6 శాతంగా ఉన్న అక్షరాస్యత, కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 82.1 శాతానికి చేరిందని, ఇప్పటివరకు 25 లక్షల మంది అక్షరాస్యులయ్యారని తెలిపారు. మిగిలిన వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలని, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్