ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ మంగళవారం నుంచి గూడ్స్ రవాణా బంద్‌కు పిలుపునిచ్చింది. టెస్టింగ్, ఫిట్‌నెస్ ఫీజులు భారీగా పెరగడంతో వాహన యజమానులు నష్టాల్లో ఉన్నారని అసోసియేషన్ తెలిపింది. 20 ఏళ్లు దాటిన వాహనాల ఫిట్‌నెస్ ఫీజు ఒక్కసారిగా రూ.33,040కు పెంచడం, 12 ఏళ్లు దాటిన లారీలకూ అధిక రుసుములు విధించడం అన్యాయమని పేర్కొంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేసింది.