సమస్యను పరిష్కరించకపోతే ఏపీలో గూడ్స్‌ రవాణా బంద్‌

లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసింది. కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్‌నెస్‌ ఫీజు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 9న అర్ధరాత్రి నుంచి రైల్వే షెడ్స్‌, షిప్‌యార్డుల్లో గూడ్స్‌ రవాణా నిలిపివేయాలని సంఘం నిర్ణయించింది. పాత వాహనాలపై అదనపు ఛార్జీల పెంపు సరకు రవాణా యజమానులపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం పెంచిన ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే అధికారం ఉందని, చర్యలు తీసుకోకపోతే గూడ్స్‌ లారీలు ఆగిపోతాయని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్