బీసీ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 బీసీ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించింది. అలాగే దాసరి సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్‌లో 15 మంది డైరెక్టర్ల నియామకం చేపట్టింది. ముదలియార్ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌లో 15 మంది డైరెక్టర్లను నియమించింది. సాగర, ఉప్పర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌లో 15 మంది డైరెక్టర్ల నియామకం చేపట్టింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్