ఫ్రీహోల్డ్ హక్కులపై ప్రభుత్వం శుభవార్త

ఏపీలో అసైన్డ్ భూములు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 20 ఏళ్ల కాలపరిమితి పూర్తయిన భూములను ఫ్రీహోల్డ్ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించాలని రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడుదలైన జీవో 588 ప్రకారం, 2004, 2005 మరియు 2006 సంవత్సరాల్లో అసైన్మెంట్ పొందిన భూములకు కూడా ఈ వెసులుబాటు కల్పించారు. అర్హులైన రైతులు త్వరలోనే తమ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో వేలాది మంది రైతులకు భూమిపై పూర్తి హక్కులు దక్కనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕