AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం వాసులు వరద నీటిలోనే కాలం వెళ్లదీస్తున్నారని వైసీపీ పేర్కొంది. మురసు తుఫాన్ కారణంగా గోపాలపురంలోని పలు గ్రామాల్లో ఇళ్లల్లోకి వరద నీరు ప్రవేశించింది. ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడింది. వరద నీటిలో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించింది.