భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం నోటీసులు

AP: వైఎస్‌ జగన్‌ సతీమణి భారతి రెడ్డికి షాక్ తగిలింది. భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌కు చెందిన రెండు సున్నపురాయి మైనింగ్‌ లీజులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించింది. మేజర్‌ మినరల్‌ అయిన సున్నపురాయి లీజులను ఈ-వేలం ద్వారానే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. దరఖాస్తు విధానంలో భారతి సిమెంట్‌కు రెండు లీజులను గత ఏడాది ఫిబ్రవరిలో జగన్‌ ప్రభుత్వం మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్