రెండు మున్సిపాలిటీల గ్రేడ్‌లు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు

AP: రాష్ట్ర ప్రభుత్వం రెండు మున్సిపాలిటీల గ్రేడ్‌లను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీ హోదాను స్పెషల్ గ్రేడ్ నుండి సెలక్షన్ గ్రేడ్‌కు పెంచారు. తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు మున్సిపాలిటీ హోదాను గ్రేడ్-3 నుంచి గ్రేడ్-1కు ఉన్నత స్థాయికి మార్చారు. మున్సిపాలిటీల ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్