కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలం: మంత్రి నారాయణ

AP: మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఇంజినీరింగ్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. కార్మికుల డిమాండ్లను త్వరగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించారని పేర్కొన్నారు. కార్మికుల డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు చర్చించిందని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుందని తెలిపారు. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్