AP: డీఎస్సీపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ‘అక్రమాస్తుల కేసు, వివేకా కేసు దర్యాప్తును వైసీపీ అధినేత జగన్ తొలుత అంగీకరించాలి. సీబీఐ తేల్చిన అంశాలను వాస్తవాలుగా ఒప్పుకోవాలి. జగన్ ఒప్పుకున్న వెంటనే డీఎస్సీపై విచారణకు సీఎం చంద్రబాబును ఒప్పిస్తా. 16,372 టీచర్ పోస్టుల భర్తీలో ఎలాంటి అక్రమాలు జరగలేదు’ అని అన్నారు.