11 వేల మంది టీచర్లకు పాత పెన్షన్ స్కీం అమలుకు ప్రభుత్వం సిద్ధం

AP: 2002, 2003 నోటిఫికేషన్ల ద్వారా 2004 తర్వాత భర్తీ అయిన సుమారు 11 వేల మంది ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్‌) అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సంబంధిత ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. 2004 సెప్టెంబరు 1 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అమల్లోకి రావడంతో, అంతకుముందు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందినప్పటికీ, వివిధ కారణాలతో 2004 తర్వాత విధుల్లో చేరిన ఉపాధ్యాయులు సీపీఎస్‌ పరిధిలోకి వచ్చారు. తమకు ఓపీఎస్‌ వర్తింపజేయాలని వారు కోరుతున్నారు. ఈ విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేసింది. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

సంబంధిత పోస్ట్