ప్రభుత్వ పథకాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలి: చంద్రబాబు

AP: అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ఏడాదిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని, 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సూచించారు. వర్షాకాలంలో ఇసుక సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధిక ఛార్జీలు వసూలు చేయడాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్