మత్స్యకార కుటుంబాలకు అండగా ప్రభుత్వం: టీడీపీ

AP: మొంథా తుఫాన్ కారణంగా సముద్రంలో వేటకు వెళ్లని మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచిందని టీడీపీ తెలిపింది. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లక జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా బియ్యం, నిత్యావసరాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 50 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెర, లీటర్ నూనె అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్